సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్‌ జగన్‌ నివాళి

1398చూసినవారు
సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్‌ జగన్‌ నివాళి
AP: సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆయనకు ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు. కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించిన మహానటుడు కృష్ణ అని, పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని జగన్ కొనియాడారు. ముఖ్యంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్