AP:
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్
జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఆయన మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమరావతి భూసమీకరణ, పార్టీ నేతలపై పెట్టిన కేసులపై
జగన్ ప్రశ్నించే అవకాశం ఉంది. సాయికృష్ణ కేసు, రాజధాని నిర్మాణాల తీరు, పథకాల అమలులో ప్రభుత్వ వైఖరిపై కూడా ఆయన అభిప్రాయాలు వెల్లడించనున్నారు.