AP:
వైసీపీ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో గురువారం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రజా పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయీధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాల నాయుడు వంటి పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాబోయే
ఎన్నికలు, పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.