AP: వైఎస్ జగన్ కు స్వల్ప ఊరట లభించింది. ఆయన లండన్ పర్యటనలో వేరే ఫోన్ నంబర్ ఇచ్చారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. విదేశీ పర్యటనలో ఆయన అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశం మాత్రమే చూడాలని కోర్టు పేర్కొంది. జగన్ తన పర్యటన నుంచి తిరిగి వచ్చినందున, సీబీఐ పిటిషన్‌కు కాలం చెల్లిందని కోర్టు తెలిపింది. జగన్ ఎప్పుడు స్వదేశానికి వచ్చారో వివరాలతో మెమో దాఖలు చేయాలని కోరింది.