AP: తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ సీఎం జగన్ అన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు తన X ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు.