AP:
వైసీపీ అధినేత వైఎస్
జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. పొగాకు పంటకు మద్దతు ధర దక్కకపోవడం, వేలం కేంద్రాల్లో ఇబ్బందులు, పెరిగిన పెట్టుబడి వ్యయం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల రైతు ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశం ద్వారా, రైతుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సమావేశం రైతులకు న్యాయం జరిగేలా చూడాలనే లక్ష్యంతో జరుగుతోంది.