18న గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ

72చూసినవారు
18న గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ
AP: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భేటీ ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైసీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్‌కు జగన్ తెలియజేయనున్నారు. కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను జగన్ స్వయంగా గవర్నర్‌కు సమర్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్