రేపు (ఫిబ్రవరి 6) మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో ధ్వంసమైన జోగి రమేశ్ ఇంటిని జగన్ పరిశీలించనున్నారు. అలాగే జోగి రమేశ్‌ను పరామర్శించనున్నారు. ఈ దాడి ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.