AP: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ఉల్లి రైతుల సమస్యల ప్రశ్నిస్తూ ఆంధ్ర రత్న భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెడలో ఉల్లిపాయల దండతో షర్మిల నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్‌లో అసెంబ్లీ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంతీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.