రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కొడుకు?

38174చూసినవారు
AP: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ రాజారెడ్డి సోమవారం కర్నూలులోని ఉల్లి మార్కెట్‌ను తన తల్లి షర్మిలతో కలిసి సందర్శించారు. ఉల్లి మార్కెట్‌కు వెళ్లే ముందు ఇంటి దగ్గర అమ్మమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెడతారని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్