AP:
వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తతతో పనిచేయాలని, పార్టీ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక వార్‌రూమ్‌లు ఏర్పాటు చేసి, రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, సీనియర్ నాయకులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.