
ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనం నిషేధం.. హైకోర్టు ఆదేశాలు అమలు
తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ కోసం ట్యాంక్ బండ్పై గణేశ్ నిమజ్జనాన్ని పోలీసులు నిషేధించారు. అక్కడ ఐరన్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయి. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్లు, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఘాట్లలోనే నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఎన్టీఆర్ మార్గ్ ఘాట్ వద్దే నిర్వహించనున్నారు.




