బద్వేల్ - Badvel

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా
అయోధ్య మోడల్లో వరంగల్ ఎయిర్ పోర్ట్ !
Oct 28, 2025, 02:10 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)

అయోధ్య మోడల్లో వరంగల్ ఎయిర్ పోర్ట్ !

Oct 28, 2025, 02:10 IST
ఓరుగల్లులోని మామునూర్ ఎయిర్‌పోర్టును ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య విమానాశ్రయం తరహాలో జెట్ స్పీడుతో నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు అవసరమైన రూ.295 కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తుగా ఇవ్వడంతో పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్ర సర్కారు భూములను కేంద్రానికి అప్పగిస్తే.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెంటనే రంగంలోకి దిగనుంది. యూపీలోని అయోధ్య ఎయిర్ పోర్ట్ తరహాలో మామునూర్ ఎయిర్ పోర్టును తక్కువ సమయంలోనే నిర్మించి ఓరుగల్లువాసులకు బహుమతిగా అందించనున్నట్లు రాష్ట్ర సర్కారు, జిల్లా అధికారులకు సమాచారమిచ్చింది.