కాశీనాయన మండలం వరికుంట్ల పంచాయతీ నాయనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త ఆర్. చంద్రయాదవ్‌తో పాటు సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో శుక్రవారం చేరారు. మాజీ జెడ్పిటిసి దేవసాని సత్యనారాయణ రెడ్డి, మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరినట్లు చంద్రయాదవ్ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.