బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలంలోని వరికుంట్ల కస్తూర్బా పాఠశాలలో టెన్త్‌లో మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థిని పాలూరి పవిత్రకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండి పరిమళ జ్యోతి రూ. 10, 116 ప్రోత్సాహక బహుమతి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు పవిత్రను అభినందించి మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.