వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పోరుమామిళ్ల పట్టణంలోని గాంధీ విగ్రహానికి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్. డి విజయ జ్యోతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహింసే ఆయుధంగా స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపిన గాంధీజీ, భారత జాతికి బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు.