ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

2456చూసినవారు
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
బద్వేలులోని మార్తోమోనగర్ లో పెంచలయ్య (38) అనే ఆటో డ్రైవర్ భార్య వెళ్లిపోయిందని మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం వివాహమైన పెంచలయ్యకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారం క్రితం భార్యతో గొడవపడడంతో ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మనస్తాపం చెందిన ఇతను సోమవారం తెల్లవారుజామున ఊరి చివర చెట్టుకు ఉరివేసుకున్నాడు. బద్వేల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్