
ప్రొద్దుటూరులో బాల్య వివాహంపై కేసు నమోదు
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికను చౌడూరు గ్రామానికి చెందిన వ్యక్తితో బాల్య వివాహం జరిపించిన ఘటనపై స్థానిక 3-టౌన్ సీఐ రామాంజనేయుడు బుధవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐసీడీఎస్, పంచాయితీ సెక్రటరీ, మహిళా పోలీసులకు అందిన సమాచారం మేరకు తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మైనర్ బాలికను కడపలోని సంరక్షణ కేంద్రానికి తరలించారు.




































