గుండెపోటుతో పోస్టల్ ఉద్యోగి మృతి

2476చూసినవారు
గుండెపోటుతో పోస్టల్ ఉద్యోగి మృతి
దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన 37 ఏళ్ల పోస్టల్ ఉద్యోగి వరికూటి సుదర్శన్ రెడ్డి వాకింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, భీమునిపాడు దారిలో గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. స్థానికులు ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్