ఖజీపేట(M) చెముళ్ల పల్లె గ్రామంలోని రైతు భరోసా కేంద్రం సమీపంలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. దీంతో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట పొలాలలో విద్యుత్ సమస్యలు అధికంగా ఉన్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేలోపు స్తంభాలను సరిచేసి ప్రమాదాలు నివారించాలని వారు కోరారు.