కడప జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో హైకోర్టు న్యాయమూర్తులతో కాన్ఫరెన్స్, వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తార్లాడ రాజశేఖర్‌రావు చైర్‌పర్సన్‌గా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ గోపాల్ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ వర్క్‌షాప్‌లో రిసోర్స్ పర్సన్లుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తులు సత్యనారాయణ, అన్వర్ బాషా పాల్గొన్నారు.