విద్యారంగ ఉపాధ్యాయ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న కర్నూలులో జరిగే సదస్సుకు సంబంధించిన కరపత్రాలను శనివారం కడప నగరంలోని యూటీఎఫ్ భవన్ లో రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజ, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు ఆవిష్కరించారు. గత ప్రభుత్వం పెండింగ్ ఆర్థిక బకాయిలను ఏపీజీఎల్ఐ, జడ్పీ పీఎఫ్ జనవరి వరకు బకాయిలను చెల్లించటం జరిగిందన్నారు. అయితే ఇంకా రూ. 25 వేల కోట్లు ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.