సీకే దిన్నె మండల పరిధిలో శనివారం నూర్జహాన్ (28) అనే వివాహిత అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. పెద్ద కాంపల్లెకు చెందిన నూర్జహాన్‌కు ఆరేళ్ల కిందట షేక్ కమాల్బాషాతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం కాగా, భర్త జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. ఇటీవల అత్తమామల నుంచి వేధింపులు అధికమవ్వడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు.