కడప జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలను పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించారు. శనివారం సాయంత్రం రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదాలు జరుగుతాయన్నారు.