కాశినాయన: పూజారిపై కత్తెరతో దాడి

2100చూసినవారు
కాశినాయన: పూజారిపై కత్తెరతో దాడి
కాశినాయన జ్యోతి క్షేత్రం రామాలయంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ప్రాంగణంలో క్షవరం చేయడాన్ని అడ్డుకున్నందుకు తనపై కోటిరెడ్డి, చిన్నపురెడ్డి కత్తెరతో దాడి చేసి గాయపరిచారని బాధితుడు కొండారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్