కడప-కృష్ణాపురం మార్గమధ్యంలో ఆదివారం సాయంత్రం గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే పోలిసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, డుకె సిమెంట్ బనియన్, మట్టి కలర్ లుంగీ, మెడలో రుద్రాక్ష, నాలుగు వరుసల మొలతాడు, రెండు తాయతులు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇతను ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు అనే వివరాలు తెలియరాలేదు.