మహిళ తలపై బండరాయితో దాడి

6చూసినవారు
మహిళ తలపై బండరాయితో దాడి
సిద్ధవటం మండలంలోని టక్కోలి బీసీ కాలనీలో మంగళవారం, శ్రావణి అనే మహిళపై అదే గ్రామానికి చెందిన బత్తల శివయ్య బండరాయితో దాడి చేశాడు. చెత్త వేయడంపై ప్రశ్నించినందుకు ఈ దాడి జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో శ్రావణికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్