
వల్లూరులో ప్రజల భద్రతకు పోలీసులు అప్రమత్తం
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, మంగళవారం వల్లూరు మండల పరిధిలో ఎస్సై పెద్ద ఓబన్న, సిబ్బందితో కలిసి గ్రామాల్లో పర్యటించారు. చెరువులు, వాగులు, నదుల వద్దకు ప్రజలు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో గంగాయపల్లిలోని మోడల్ స్కూల్ లో షెల్టర్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ప్రజలు సహకరించి సురక్షితంగా ఉండాలని ఎస్సై పెద్ద ఓబన్న విజ్ఞప్తి చేశారు.





































