
దువ్వూరు మండలంలో పంట నష్టం, అన్నదాతల ఆందోళన
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దువ్వూరు మండలంలోని చిన్న సింగనపల్లి, చల్ల బసయపల్లి, గొల్లపల్లి, మణిరంపల్లి, గుడిపాడు, మదిరేపల్లి, నీలాపురం, రామాపురం వంటి పలు గ్రామాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయల పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైదుకూరు నియోజకవర్గంలో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం తమకు తగిన సహాయం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.






































