కమలాపురం నుంచి శ్రీశైలం వెళ్తున్న ఇసుక ట్రిప్పర్‌ను మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనం బోల్తాపడి స్తంభం విరిగి తీగలు తెగిపోయాయి. వెంటనే లైన్లు ట్రిప్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న రైతు అరటి పంట ధ్వంసమైంది.