బ్రహ్మంగారిమఠానికి చెందిన పాత జోగాళ్ల జోగయ్య వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా జోగయ్య తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.