కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే

1571చూసినవారు
కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే
మైదుకూరు నియోజకవర్గం చాపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మంగపట్నం పెద్ద సుబ్బరాయుడు అనారోగ్యంతో ప్రొద్దుటూరులోని వెంకట ఆరాధ్య న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని తెలిసి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సుబ్బరాయుడికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట చాపాడు మండల టీడీపీ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, స్టేట్ డైరెక్టర్ అన్నవరం సుధాకర్ రెడ్డి, పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్