వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా శనివారం కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, మైదుకూరు నియోజకవర్గ ప్రగతికి సంబంధించిన అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.