వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు సమీపంలో దువ్వూరు మండలం జగనన్న కాలనీలో ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. గురువారం అర్ధరాత్రి జాకీర్ దువ్వూరు సమీపంలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా, స్మగ్లర్ పోలీసులపై తిరగబడటంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జాకీర్‌కు గాయాలవడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. జాకీర్‌పై చాపాడు పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది.