కడప జిల్లా ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

84చూసినవారు
కడప జిల్లా ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
హోలీ పండుగను పురస్కరించుకొని కడప జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుభాకాంక్షలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని, హోలీ పండుగ పేరుతో సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లినా ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. అన్ని మతాల వారు మత సామరస్యం పాటిస్తూ ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతతో జరుపుకోవాలన్నారు.