నులిపురుగుల నివారణపై విద్యార్థులకు అవగాహన

1619చూసినవారు
నులిపురుగుల నివారణపై విద్యార్థులకు అవగాహన
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ శ్రీవిద్య, వైద్య బృందం విద్యార్థులకు నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, నివారణ చర్యలు, అల్బెండజోల్ మాత్రల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అల్బెండజోల్ తీసుకోండి నులిపురుగులను నివారించండి!' అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్