Oct 27, 2025, 14:10 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
ప్రభుత్వ నిధులతో నాటిన మహావృక్షాలను రైతు నరికివేత!
Oct 27, 2025, 14:10 IST
మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి–చెట్ల ముప్పారం రోడ్డుపై ప్రభుత్వ నిధులతో నాటిన మహావృక్షాలను ఓ రైతు మొక్కజొన్న పంటకు ఎండ కావాలనే పేరుతో రాత్రికి రాత్రే నరికివేశాడు. ప్రజా ఆస్తిని ధ్వంసం చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల మందికి నీడనిచ్చిన వృక్షాలు నేలకూలడంతో రోడ్డంతా ఎడారిలా మారిందని, అటవీశాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. "ఒకరికి ఎండ కావాలంటే, అందరి ఊపిరి నరికేయాలా?" అని పచ్చదనం మిత్రులు మండిపడుతున్నారు.