ప్రొద్దుటూరులోని శ్రీ సాయి రాజేశ్వరి నర్సింగ్ కాలేజీలో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ పి. నరేష్ కుమార్ ఆరోగ్యకరమైన జీవనశైలి, రక్తదానం, సోషల్ మీడియా మోసాలు, హెచ్ఐవి, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులపై సమాచారం అందించారు.