ప్రొద్దుటూరులో తల్లితండ్రులకు ఎస్సై కౌన్సిలింగ్

4చూసినవారు
ప్రొద్దుటూరులో తల్లితండ్రులకు ఎస్సై  కౌన్సిలింగ్
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఆర్ట్స్ కాలేజ్ నాలుగు రోడ్ల కూడలి వద్ద ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మరియు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది. ఈ స్పెషల్ డ్రైవ్ లో మైనర్ డ్రైవింగ్ మరియు ర్యాష్ డ్రైవింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి వాహనదారుల పైన 20 కేసులు నమోదు చేసి, రూ. 15, 650/- లు జరిమానా విధించడమైనది. మైనర్ డ్రైవింగ్ చేసిన పిల్లలను వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పదు అన్నారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్