ప్రొద్దుటూరులో వినాయక నిమజ్జనంలో అపశృతి

1592చూసినవారు
ప్రొద్దుటూరులో వినాయక నిమజ్జనంలో అపశృతి
వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో వినాయక నిమజ్జన ఊరేగింపులోఆదివారం అపశృతి చోటుచేసుకుంది. ఆర్ట్స్ కాలేజీ వీధిలో వినాయక ప్రతిమ వద్ద ఉన్న ప్లస్ బాక్స్ బోర్డును తాకడంతో డిప్లొమా సెకండియర్ విద్యార్థి సందీప్‌కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురై, ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. సందీప్‌కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నేడు సందీప్ పుట్టినరోజు అని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురై, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్