ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆదివారం ఆలయ అధికారులు ఆహ్వానించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహక అధికారి వెంకటసుబ్బయ్య ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లి దసరా ఉత్సవాల నిర్వహణ గురించి ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ అర్చకులు ఉదయ్, మహేష్, సతీశ్, స్వరూప్ ఆయనకు ప్రసాదాలు అందజేశారు.