ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని గురువారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, రాయలసీమ ఇన్చార్జ్ ఎండీ అయుబ్ ఖాన్ వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ ఉర్దూ చదివిన విద్యార్థులు డిగ్రీ ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక విద్యార్థులు మధ్యలోనే చదువును విరమించుకుంటున్నారని తెలిపారు