శనివారం, డీఎల్డీవో విజయలక్ష్మి చక్రాయపేట మండల పరిధిలోని మారెళ్ల మడక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమయ్యారు. గ్రామాల్లో చెత్త సేకరణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గ్రామస్థుల ఉపయోగార్థం చెత్త సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆమె ఆదేశించారు.