జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30న వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్నపల్లి గ్రామంలో జల జీవన్ పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని
జనసేన నాయకుడు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన శుక్రవారం పిలుపునిచ్చారు.