పులివెందుల పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కళాశాలలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు PHASOR 2K25 సదస్సు నిర్వహించనున్నట్లు ఈఈఈ డిపార్ట్మెంట్ హెచ్డీ నరసింహారెడ్డి తెలిపారు. ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు ఈ సదస్సులో భాగంగా మంగళవారం వర్క్ షాప్, బుధవారం ఎంబెడెడ్ రోబో ట్రిక్స్ సదస్సు, గురువారం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.