సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పై అవగాహనలో భాగంగా పులివెందుల పట్టణంలో గురువారం ఎంవీఐ శాఖ ఆధ్వర్యంలో బైకుల ర్యాలీ నిర్వహించారు. అర్బన్ సీఐ సీతారాంరెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. వి. ప్రసాద్ ఈ ర్యాలీని జెండాలు ఊపి ప్రారంభించారు. పురవీధులలో బైకులతో ర్యాలీ నిర్వహిస్తూ జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించారు. అనంతరం పూలంగళ్ల సర్కిల్ వద్ద బైకర్స్ మానవహారంగా ఏర్పడ్డారు.