పులివెందులలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని సచివాలయాల వద్ద లబ్ధిదారులు తమ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. సచివాలయ సిబ్బందికి కూడా ఎవరి కార్డు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. సమాచారం అడిగినప్పుడు ప్రజలపై సిబ్బంది విసురుకుంటూ, వారిని సచివాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ గందరగోళం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.