
పులివెందులలో అగ్నిప్రమాదం
బుధవారం రాత్రి పులివెందుల పట్టణంలోని శ్రీనివాస హాల్ సమీపంలో విద్యుత్ తీగలు చెట్టుకు తగలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.



































