
పులివెందులలో వైఎస్ జగన్ సతీమణి
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా, ఆయన సతీమణి వైయస్ భారతి బుధవారం పులివెందుల క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆమె నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు ఆమెను కలిసి, ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


































