నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో జమ్ములయ్య అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఈ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. అతను వైఎస్సార్‌సీపీ నాయకుల అనుచరుడని, సొంత కార్యకర్తలతోనే విగ్రహాల ధ్వంసం చేయించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని పోలీసుల విచారణలో తెలినట్లు టీడీపీ పేర్కొంది. గొడ్డలి పార్టీ వైఎస్సార్‌సీపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని TDP తన అధికారిక వెబ్‌సైట్‌లో వీడియోను షేర్ చేసింది.